నేటి సమాజంలో టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ ప్రభావం ఎక్కువగా యువతపై పడుతోంది. అయితే.. కౌమార దశలో ఉన్న యువత టెక్నాలజీలో ఉన్న మంచికంటే చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే.. కొత్త రకం మత్తుకు స్కూల్ పిల్లలు అలవాటు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులు ఈ- సిగరెట్లకు అలవాటు పడుడుతున్నట్లు తెలుస్తోంది. మత్తు ఇచ్చే ఫ్లేవర్స్ వేసుకుని బడాబాబుల పిల్లలు ఎలక్ర్టానిక్ సిగరెట్లు తాగుతున్నట్లు, స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఈ-సిగరెట్లు కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్న పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ లలో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీస్ ల సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఎలక్ట్రానికి సిగరెట్లు తాగుతున్న విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. సబ్ వే లో ఈ-సిగరెట్లు తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
Also Read : Sagileti katha: చికెన్ చుట్టూ ‘సగిలేటి కథ’..ట్రైలర్ కి అనూహ్య స్పందన
ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూళ్ల పక్కనే ఈ సబ్ వేలు ఉన్నాయి. సబ్ వేల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకుని, పిల్లలు, పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. రాయదుర్గంలోని సబ్ వేపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పటి వరకు మొత్తం 12 కేసులు నమోదు చేసిన్నట్లు సమాచారం. అయితే.. ఈ సందర్భంగా.. Ntv తో మాదాపూర్ డీసీపీ సందీప్ మాట్లాడుతూ.. ఇంటర్ నేషనల్ స్కూల్ లలో పిల్లలకు పెద్ద మొత్తం లో పాకెట్ మనీ ఇస్తున్నారు… ఈ-సిగరెట్స్ కు ఇంటర్ నేషనల్ స్కూల్ లలోని పిల్లలు అలవాటు పడ్డారు.. బయటి రాష్ట్రాల నుండి ఈ సిగరెట్స్ ను తెచ్చి.. ఇక్కడ పిల్లలకు అమ్ముతున్నారు.. ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో 12 కేసులు నమోదు చేసాం అని ఆయన తెలిపారు. ‘పిల్లల పై తల్లితండ్రుల నిఘా ఉండట్లేదు..స్కూల్ బయట ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని స్కూల్ మేనేజ్ మెంట్లు వున్నాయి.. ఇకపై ఇలాంటి కేసుల్లో పిల్లలు పట్టుబడితే..స్కూల్ లపై కూడా కేసులు నమోదు చేస్తాము.. మొదటి సారి కాబట్టి కౌన్సిలింగ్ తో సరిపెడుతున్నాము.. మరో సారి ఈ సిగరెట్స్ తాగుతూ దొరికితే… మైనర్ లు అని కూడా చూడము.. పిల్లలతో పాటు పేరెంట్స్ ను కూడా బాధ్యులను చేస్తాము.. ఈ సిగరెట్స్ వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది… ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల వ్యవహారాలు మాకు తెలుస్తున్నాయి.. ఇకపై విద్యార్థుల మీద పోలీస్ ల నిరంతర నిఘా వుంటుంది’ అని డీసీపీ వెల్లడించారు.
