NTV Telugu Site icon

Vijayawada: ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు.. 40 మంది అర్చకులతో పాటు పలువురు బదిలీలు..!

Vijayawada Kanaka Durga Temple

Vijayawada Kanaka Durga Temple

Vijayawada: ప్రముఖ శక్తిపీఠం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు చేపట్టారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఆరు నెలలకోసారి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

Read Also: Minister Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్.. ఆధునిక ప్లాంట్లను సందర్శించిన మంత్రి నారాయణ..!

ఇటీవల మాజీ ఈవో కేఎస్ రామారావు బదిలీ కాలపరిమితి ముగియడంతో, ప్రస్తుత ఈవో శీనా నాయక్ బదిలీల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వేద పండితులు, అర్చకులు, పరిచారకులు ఎవరెక్కడ పనిచేస్తున్నారనే విషయాన్ని ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం 9 మంది ఉద్యోగులు, 40 మంది అర్చకులు, 20 మంది పరిచారకులు, 3 మంది వేద పండితులను కొత్తగా బదిలీ చేశారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వృత్తిపరమైన అనుభవాన్ని విస్తరించేందుకు, ఆలయ నిర్వహణ మరింత సవ్యంగా సాగేందుకు ఈ మార్పులు సాయపడతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

ఈ బదిలీలు ఆలయంలోని వివిధ శాఖలలో సమతుల్యతను తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. భక్తుల సేవను మరింత మెరుగుపరచడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని ఈవో కార్యాలయం స్పష్టం చేసింది.