Vijayawada: ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు.. 40 మంది అర్చకులతో పాటు పలువురు బదిలీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ప్రముఖ శక్తిపీఠం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు చేపట్టారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఆరు నెలలకోసారి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
Also Read
ఇటీవల మాజీ ఈవో కేఎస్ రామారావు బదిలీ కాలపరిమితి ముగియడంతో, ప్రస్తుత ఈవో శీనా నాయక్ బదిలీల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వేద పండితులు, అర్చకులు, పరిచారకులు ఎవరెక్కడ పనిచేస్తున్నారనే విషయాన్ని ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం 9 మంది ఉద్యోగులు, 40 మంది అర్చకులు, 20 మంది పరిచారకులు, 3 మంది వేద పండితులను కొత్తగా బదిలీ చేశారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వృత్తిపరమైన అనుభవాన్ని విస్తరించేందుకు, ఆలయ నిర్వహణ మరింత సవ్యంగా సాగేందుకు ఈ మార్పులు సాయపడతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!
ఈ బదిలీలు ఆలయంలోని వివిధ శాఖలలో సమతుల్యతను తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. భక్తుల సేవను మరింత మెరుగుపరచడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని ఈవో కార్యాలయం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
-
AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
-
China: “మనం శత్రువులం కాము”.. భారత్‌కు చైనా సందేశం..
-
INDIA Bloc: 2 ఏళ్ల తర్వాత విపక్ష కూటమి భేటీ.. ఏం చర్చించారంటే..!
-
SlumDog Movie Teaser: ‘మా బతుకులతో ఆడుకుంటే వదలం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ ‘స్లమ్‌డాగ్’ టీజర్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!