Inter Student Suicide: గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

  • ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
  • కమలాపురం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఘటన
  • విద్యార్థిని కమలాపురం ప్రభుత్వాస్పత్రికి తరలింపు
Suicide Attempt

Suicide Attempt

Inter Student Suicide: కడప జిల్లాలోని కమలాపురం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ గదిలో గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. నొప్పితో బాధపడుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గమనించారు. విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయగా.. హుటాహుటిన కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వై కౌసల్యగా గుర్తించారు.

Read Also: AP High Court: ఇదేం పద్ధతి, ఇదేం భాష?.. గుంటూరు మేయర్‌కు హైకోర్టు చురకలు

×
×
Ad

హాస్పిటల్లో విద్యార్థిని గురుకుల పాఠశాల డిస్టిక్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ పరామర్శించారు. ఎందుకు సూసైడ్‌కు ప్రయత్నించావని విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ చాలా గోప్యంగా ఉంచి హెల్త్ సూపర్‌వైజర్‌ రెడ్డెమ్మ ఆధ్వర్యంలో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది