NTV Telugu Site icon

Team India: మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ సన్నివేశం.. వీడియో ఇదిగో..

Gill, Ayyar

Gill, Ayyar

నిన్న ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు, శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేశారు. ఈ బ్యాట్స్ మెన్లు సెంచరీలు బాదడంతో భారత్ స్కోరు భారీగా వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గిల్, అయ్యర్ ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడారు.

Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్

ఆ వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. అందులో గిల్, శ్రేయాస్ అయ్యర్ ఒకరి గురించి ఒకరు సమాధానాలు చెప్పుకుంటారు. ఈ వీడియోలో గిల్, అయ్యర్ పెన్ను మరియు నోట్‌ప్యాడ్‌ను పట్టుకుని కనిపించారు. అంతేకాకుండా వారిద్దరూ తమ సమాధానాలను ఈ ప్యాడ్‌పై రాశారు. ముందుగా భాగస్వామ్యానికి సంబంధించి వారిద్దరినీ అడిగిన మొదటి ప్రశ్నకు ఇద్దరు బ్యాట్స్‌మెన్ సరైన సమాధానం ఇచ్చి నోట్‌ప్యాడ్‌పై 200 రాశారు.

DK ShivaKumar: బీజేపీ-జేడీఎస్‌ పొత్తుపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఆ తర్వాత మీ బ్యాటింగ్ భాగస్వామి ఎన్ని పరుగులు చేశాడు.. ఎన్ని బంతులు ఆడాడు అని రెండవ ప్రశ్న అడిగారు. మరోసారి ఇద్దరు సరైన సమాధానం ఇచ్చారు. గిల్ 90 బంతుల్లో అయ్యర్ చేసిన 105 పరుగుల స్కోర్‌ను నోట్‌ప్యాడ్‌పై రాశాడు. అయ్యర్ గిల్ స్కోరును 97 బంతుల్లో 104 పరుగులుగా రాశాడు. అయితే మూడో ప్రశ్న కాస్త కష్టంగా ఉంది. మీ బ్యాటింగ్ పార్టనర్ 100 పరుగులు చేసినప్పుడు ముందు ఏ బౌలర్ అని ఇద్దరినీ అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానమివ్వడంలో ఇద్దరు కొద్దిసేపు ఆలోచించారు. కానీ చివరికి సరైన సమాధానం ఇచ్చారు. ఆడమ్ జంపా వేసిన బౌలింగ్ లో అయ్యర్ 100 పరుగులు చేయగా.. సీన్ అబాట్ వేసిన బౌలింగ్ లో గిల్ 100 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఒకరి సెంచరీలో ఒకరి సిక్సర్‌లు, ఫోర్ల గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి ఇద్దరు బ్యాట్స్‌మెన్లు తప్పు సమాధానాలు చెప్పారు.