Aanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం.. ఆన్వీ కామ్దార్ బ్యాగ్రౌండ్ ఇదే!
- విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం
- ఆన్వీ కామ్దార్ బ్యాగ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమెకు టూర్ లంటే మహా ఇష్టం. ఆమె ప్రయాణంలో అందమైన స్థలాల దగ్గరకు వెళ్లడం.. సముద్రాల దగ్గరకు వెళ్లడం.. పురాతన కట్టడాల దగ్గరకు వెళ్లడం హాబీ. వాటిని కెమెరాలో బంధించి ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లో పోస్టు చేయడం చాలా ఇష్టం. అంతేకాదు.. దాని యొక్క విశిష్టతను వివరించడం మరింత ఇష్టం. స్వదేశమే కాదు.. విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ఇలా మొదలైన ఆమె ప్రయాణం.. చివరికి అదే ఆమె ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. ఆమెనే ట్రావెల్ డిటెక్టివ్ ఆన్వీ కామ్దార్. సొంత గడ్డపై ఉన్న జలపాతాన్ని చిత్రీకరిస్తూ.. ప్రమాదవశాత్తు లోయలోపడి తుదిశ్వాస విడిచింది. ఇక ఆమె లేదన్న చేదువార్త విని ఆమె అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. అసలామె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? ఎలా చనిపోయింది. ఆమెను మృత్యువు ఎలా వెంటాడింది అనేది తెలియాలంటే మరిన్ని వివరాల కోసం ఈ వార్త చదవండి.
ఆన్వీ కామ్దార్.. ట్రావెల్ డిటెక్టివ్. ముంబైలో జన్మించింది. ప్రయాణాలు అంటే ఆమెకు మహా ఇష్టం. అలా ఆమె అందమైన ప్రదేశాలను చిత్రీకరించి ఇన్‌స్టా, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటుంది. దీంతో ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దాదాపు 3 లక్షల మంది అభిమానులను సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
అయితే ఆమె రెండ్రోజుల క్రితం మహారాష్ట్రలోని కుంభే జలపాతానికి వెళ్లింది. ఓ వైపు జోరున వర్షం కురుస్తోంది. అయినా కూడా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. స్నేహితులతో కలిసి విహరిస్తోంది. జలపాతం విశిష్టతను వివరిస్తూ.. పొరపాటున కొండ అంచున కాలు వేసింది. అమాంతంగా 300 అడుగుల లోతుల్లో పడిపోయింది. బండసందుల్లో ఇరుక్కోవడంతో ఆరు గంటల పాటు నరకయాతన అనుభవించింది. మొత్తానికి పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి… శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆమె లేరన్న వార్త తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టిందో.. అక్కడే ముగియడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?