Aanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం.. ఆన్వీ కామ్‌దార్ బ్యాగ్రౌండ్ ఇదే!
- విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం
- ఆన్వీ కామ్‌దార్ బ్యాగ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమెకు టూర్ లంటే మహా ఇష్టం. ఆమె ప్రయాణంలో అందమైన స్థలాల దగ్గరకు వెళ్లడం.. సముద్రాల దగ్గరకు వెళ్లడం.. పురాతన కట్టడాల దగ్గరకు వెళ్లడం హాబీ. వాటిని కెమెరాలో బంధించి ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లో పోస్టు చేయడం చాలా ఇష్టం. అంతేకాదు.. దాని యొక్క విశిష్టతను వివరించడం మరింత ఇష్టం. స్వదేశమే కాదు.. విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ఇలా మొదలైన ఆమె ప్రయాణం.. చివరికి అదే ఆమె ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. ఆమెనే ట్రావెల్ డిటెక్టివ్ ఆన్వీ కామ్‌దార్. సొంత గడ్డపై ఉన్న జలపాతాన్ని చిత్రీకరిస్తూ.. ప్రమాదవశాత్తు లోయలోపడి తుదిశ్వాస విడిచింది. ఇక ఆమె లేదన్న చేదువార్త విని ఆమె అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. అసలామె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? ఎలా చనిపోయింది. ఆమెను మృత్యువు ఎలా వెంటాడింది అనేది తెలియాలంటే మరిన్ని వివరాల కోసం ఈ వార్త చదవండి.
ఆన్వీ కామ్‌దార్.. ట్రావెల్ డిటెక్టివ్. ముంబైలో జన్మించింది. ప్రయాణాలు అంటే ఆమెకు మహా ఇష్టం. అలా ఆమె అందమైన ప్రదేశాలను చిత్రీకరించి ఇన్‌స్టా, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటుంది. దీంతో ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దాదాపు 3 లక్షల మంది అభిమానులను సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు.
Also Read
- Rahul Gandhi: 'విద్యార్థులను చంపమని ఎవరు ఆదేశించారు?' అమిత్ షాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలు
- Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
అయితే ఆమె రెండ్రోజుల క్రితం మహారాష్ట్రలోని కుంభే జలపాతానికి వెళ్లింది. ఓ వైపు జోరున వర్షం కురుస్తోంది. అయినా కూడా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. స్నేహితులతో కలిసి విహరిస్తోంది. జలపాతం విశిష్టతను వివరిస్తూ.. పొరపాటున కొండ అంచున కాలు వేసింది. అమాంతంగా 300 అడుగుల లోతుల్లో పడిపోయింది. బండసందుల్లో ఇరుక్కోవడంతో ఆరు గంటల పాటు నరకయాతన అనుభవించింది. మొత్తానికి పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి… శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆమె లేరన్న వార్త తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టిందో.. అక్కడే ముగియడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘విద్యార్థులను చంపమని ఎవరు ఆదేశించారు?’ అమిత్ షాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలు
-
BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
-
Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్‌లో మిడిల్‌క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!