కరీంనగర్ లోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృత దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు శాంతినగర్ కస్తూర్బా ప్రిన్సిపాల్ తరలించారు. అయితే, కాలేజీలో తమ కూతురికి సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్ కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్షిత మృతదేహం మార్చురిలో ఉంది. ఇక, అక్షిత స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి గ్రామం.. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో తన కుటుంబ సభ్యులతో పాలు స్నేహితుల పేర్లు రాసి వారికి క్షమాపణ చేప్పింది. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Student Suicide: కరీంనగర్ లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Suicide