తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5న మొదలై.. 24తో ముగుస్తాయి. కాగా.. మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్ పరీక్షలు 25వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్!
కాగా.. విద్యార్థులు నేరుగా అంతర్జాలం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల సమయం దగ్గరపడటంతో విద్యార్థులందరూ హాల్‌టికెట్లు తప్పక డౌన్‌లోడ్ చేసుకోండి. https://tgbie.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందండి..
READ MORE: Chandra Sekhar Tatiparthi: సీఎం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా?
ఒత్తిడి వద్దూ..
ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పిల్లలు చాలా కష్టపడి చదవుతుంటారు. మంచి మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చదువుకునే సమయంలో ఆందోళన, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలే వీరి ఒత్తిడికి కారణం అని చెప్పొచ్చు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పిల్లల్లో అధికంగా ఉంటుంది. దీంతో ఆందోళన, భయం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు డిప్రెషన్ కు కూడా లోనవుతుంటారు. ఇలా అవ్వకుండా తల్లిదండ్రులు వాళ్లను నిరంతరం పర్యవేక్షించండి..