NTV Telugu Site icon

Instagram Down: ఒక్కసారిగా నిలిచి పోయిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు! అసలేం జరిగింది?

Instagram

Instagram

శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్‌)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 12:05 గంటల సమయంలో ఈ సమస్యపై 6,000 మంది నివేదించారు. 33% మంది యాప్‌లోనే సమస్యలను కలిగి ఉన్నారు. 57% మంది ఫీడ్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. 10% లాగిన్ ఎర్రర్‌లను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో సమస్యను పరిష్కరించడానికి.. వినియోగదారులు తమ ఫోన్‌లను రి స్టార్ట్ చేయడం, ఇంటర్నెట్ కనెక్షన్‌లను తనిఖీ చేయడం, Instagram యాప్‌ను అప్ డేట్ చేసి ప్రయత్నించారు.

READ MORE: Yellow Alert: రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై మరియు చెన్నై వంటి ప్రధాన భారతీయ నగరాల్లో ఈ సమస్య ఏర్పడింది. ఈ అసౌకర్యాన్ని పసిగట్టిన వినియోగదారులు.. “ఎక్స్” లో తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది రీల్స్ వంటి ఫీచర్‌లను లాగిన్ చేయలేకపోవడం, యాక్సెస్ చేయలేకపోవడం భారీ ట్వీట్లకు దారితీసింది. కొద్ది సేపు “ఇన్‌స్టాగ్రామ్ డౌన్” (#instagramdown) హ్యాస్ ట్యాక్ వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన “మీమ్స్” ఎక్స్ లో చెక్కర్లు కొట్టాయి. “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందో లేదో చూడటానికి అందరూ ట్విట్టర్‌కి వెళ్తున్నారా?” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేయబడింది” అంటూ ఓ వినియోగదారుడు పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ అంతరాయానికి సంబంధించి వివరాలు ఇంకా వెల్లడించలేదు.