Site icon NTV Telugu

Steal Wires: టీవీ సీరియల్‌ స్ఫూర్తితో.. ఐఫోన్‌ కోసం వైర్లను ఎత్తుకెళ్లారు.. చివరకు?

Iphone

Iphone

Steal Wires: ఐఫోన్‌ కొనుక్కోవాలని వైర్ల దొంగతనానికి ఒడిగట్టారు ముగ్గురు యువకులు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని నస్రుల్లాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మైనర్‌లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్‌లో చోరీ సీన్‌ నుంచి ప్రేరణ పొంది ‘ఐఫోన్‌లు’ కొనుగోలు చేయడానికి, ఇండోర్‌ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు. జనవరి 12 రాత్రి సెహోర్‌లోని కృషి ఉపాజ్ మండి ప్రాంతంలోని ఒక దుకాణంలో జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించి ముగ్గురిని బుధవారం అరెస్టు చేశారు. నిందితులను అశుతోష్ విశ్వకర్మగా, మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 3.52 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నస్రుల్లగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృషి ఉపాజ్ మండి సమీపంలో మోటార్ వైండింగ్ దుకాణం నడుపుతున్న లోకేంద్ర శర్మ జనవరి 13న దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. అతను దుకాణానికి తాళం వేసినట్లు పోలీసులకు చెప్పాడు. రాత్రి సమయంలో షాపింగ్ చేసి, మరుసటి రోజు ఉదయం దుకాణానికి చేరుకునే సరికి తాళం పగులగొట్టి ఉంది. షాపులోపల తనిఖీ చేయగా రాగి తీగలు, మోటారు రోటర్ ప్లేట్ కనిపించడం లేదు. అతని ఫిర్యాదు మేరకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) ఆకాష్ అమల్కర్ వెల్లడించారు. విచారణలో సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ముగ్గురు యువకులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.

Read Also: scrap: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు ఇక తుక్కే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..

ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో వారిని ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానానికి పోలీసులు ఆశ్చర్యపోయారు. వారు ఐఫోన్‌లు కొనాలనుకుంటున్నారని, ఇండోర్‌ను సందర్శించాలనుకుంటున్నట్లు పోలీసులకు చెప్పారు. అంతేకాకుండా వారు ఒక టీవీ సీరియల్ నుంచి దొంగతనం చేయడానికి ప్రేరణ పొందారని పోలీసులు వెల్లడించారు. సీరియల్‌లో వచ్చిన ఓ సన్నివేశాన్ని చూసి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారని వారు తెలిపారు. నిందితుడు అశుతోష్‌ తన ఇంటి నుంచి కారు తెచ్చి పెయింట్‌ షాపులో స్ప్రే పెయింట్‌ కొని, సీసీ కెమెరాకు స్ప్రే పెయింట్‌ వేసి షాపు తాళం పగులగొట్టి విలువైన వస్తువులతో పరారయ్యాడు. నిందితులు నేరాన్ని అంగీకరించగా తదుపరి దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version