T20 World cup: టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్. ఈ నేపథ్యంలో భారత క్రీడాకారులు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నెట్స్‌లో సాధన ఆరంభించగా.. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ముంజేయికి గాయమైనట్లు తెలుస్తోంది. షాట్ ఆడే క్రమంలో అతడి కుడి ముంజేతికి బంతి తగిలినట్లు తెలుస్తోంది. దీంతో హిట్‌మ్యాన్ ఇబ్బందికి గురికాగా.. వెంటనే స్పందించిన సిబ్బంది అతడికి చికిత్స అందించింది. దీంతో కొద్దిసేపు రోహిత్ బ్యాట్‌ను వదిలి వెళ్లిపోయాడు. అయితే రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడేమోనని ప్రాక్టీస్ చూసేందుకు వచ్చిన క్రీడాభిమానులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న రోహిత్.. చికిత్స అనంతరం తిరిగి బ్యాట్ పట్టడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఏ నొప్పి లేకుండా బ్యాటింగ్ చేసిన రోహిత్.. మళ్లీ నొప్పి తిరగబడితే మాత్రం సెమీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రావద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Sukesh Chandrashekar: ఆప్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు
ఇదిలా ఉండగా.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమిండియా అడిలైడ్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా ఇంగ్లండ్‌తో గురువారం జరిగే మ్యాచ్‌పైనే ఉంది. ఈ పోరుకు వేదిక అడిలైడ్ వేదిక కానుండడం భారత్‌కు సానుకూలాంశం కానుంది. ఎందుకంటే.. భారత్ ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వర్షప్రభావిత మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఇక్కడి పరిస్థితులపై ఇంగ్లండ్ కన్నా భారత ఆటగాళ్లకే ఎక్కువ అవగాహన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో బ్రిస్బేన్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలలోనే బరిలోకి దిగింది. అయితే పొట్టి ఫార్మాట్‌లో గత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఉండని విషయం తెలిసిందే. ఆ రోజున ఎవరు, ఎలా ఆధిపత్యం ప్రదర్శిస్తారనే దానిపైనే ఫైనల్‌కు వెళ్లగలమా? లేదా? అనేది నిర్ణయమవుతుంది. ఈ విషయం భారత జట్టుకు కూడా తెలుసు కాబట్టి.. జాగ్రత్తగా ఆడి తుది పోరుకు చేరాలనుకుంటోంది టీమిండియా. ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.