దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలకు ద్రవ్యోల్బణం భారంగా మారింది. గత నెలలో టమాటా ధర పలు నగరాల్లో కిలో రూ.300 దాటగా.. చండీగఢ్‌లో కిలో టమాటా ధర రూ.350కి అమ్ముడుపోయింది. అయితే గత 10 రోజులుగా టమాటా ధర కొంతమేర తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కిలో 100 నుంచి 150 రూపాయలకు అమ్ముడు పోతుంది. దీంతో సామాన్య ప్రజానీకానికి కొంత ఊరట లభించినట్లైంది. అయితే ఈ ఆశ ఎక్కువ కాలం ఉండేలా కనిపించడం లేదు. త్వరలోనే టమాటా ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. మళ్లీ టమాటా ధర కిలో రూ.200 దాటుతుందని అంటున్నారు.
Hyderabad: HCA పరిధిలోని 57 క్రికెట్ క్లబ్స్ పై వేటు
కొన్ని నివేదికల ప్రకారం.. హోల్‌సేల్ వ్యాపారులే టమోటాలను కిలో రూ. 200 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలుపుతుంది. ఇలాంటి పరిస్థితిల్లో.. రిటైల్ మార్కెట్‌లో ధరలు ప్రభావితం కానున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ మార్కెట్‌లో 25 కిలోల టమోట క్రేట్.. ధర 4,100 రూపాయలు ఉంది. అయితే ఢిల్లీకి చెందిన వ్యాపారులు ఉత్తరాఖండ్‌లోని మండి నుంచి టొమాటోలను కొనుగోలు చేస్తే రవాణా ఛార్జీలు, కమీషన్ మరియు ఇతర ఛార్జీలు కలిపితే.. ఒక టమాటా క్రేట్ ధర రూ. 5,000 వరకు చేరుతుంది. దీంతో రిటైల్ మార్కెట్‌లో మరోసారి టమాట ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Andhrapradesh Crime: దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను కొట్టి చంపిన భర్త
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త.. డెహ్రాడూన్‌లో ఒక్కో క్రేట్ రూ.4,100 చొప్పున టమాట కొనుగోలు చేశాడు. ఇప్పుడు అది ఢిల్లీకి వచ్చేసరికి 5000 వేలకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.200 దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ రిటైల్ మార్కెట్‌లో టమోటా కిలో రూ.150 నుంచి 180 వరకు విక్రయిస్తున్నారు. టమాట ధరలపై కూరగాయల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అనిల్ మల్హోత్రా మాట్లాడుతూ.. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఢిల్లీకి టమాటాలు సరఫరా అవుతున్నాయన్నారు. 2021 మరియు 2022 సంవత్సరాల్లో టమోటాలు బాగా పండాయని.. అప్పుడు రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని తెలిపారు. కానీ ఈ ఏడాది రైతులు టమోటా సాగును తగ్గించడంతో ఉత్పత్తిపైనా ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.
