Infinix Note 40 5G Launch Date In India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఇన్ఫినిక్స్’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండే ఉంది. ఎప్పటికపుడు లేటెస్ట్ మోడల్స్ రిలీజ్ చేస్తూ.. ఇక్కడి మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ‘ఇన్ఫినిక్స్ నోట్ 40’ 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే వారం ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ లైనప్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ చేరనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Infinix Note 40 5G Price:
మే నెలలో ఫిలిప్పీన్స్‌లో ‘ఇన్ఫినిక్స్ నోట్ 40’ లాంచ్ అయింది. అదే వెర్షన్ భారత మార్కెట్లో లాంచ్ కానుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. జూన్ 21న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వేరియంట్స్ ఇంకా ప్రకటించకున్నా.. ధర మాత్రం రూ. 20,000 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ వస్తోందని తెలుస్తోంది.
Also Read: SA vs NEP: ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!
Infinix Note 40 5G Specs:
ఇన్ఫినిక్స్ నోట్ 40 ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14, ఐపీ53 రేటింగ్‌తో రానుంది.120Hz రిఫ్రెష్ రేట్, 6.78 ఇంచెస్ ఫుల్-హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు 2ఎంపీ సెన్సార్‌లతో పాటు 108ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 33 డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15 డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో రానుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియరానున్నాయి.