Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌ను పర్యాటకుల కోసం ప్రభుత్వం అధికారికంగా తెరిచింది. నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టుల ప్రాభవం తగ్గి, భద్రతా పరిస్థితులు మెరుగవ్వడంతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ అటవీ ప్రాంతంలోకి పర్యాటక రంగాన్ని అనుమతించారు. దేశంలోనే నాల్గవ అతిపెద్దదైన ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు, చిరుతపులులు, అడవి దున్నలు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ సుమారు 6 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొదటి విడతలో పరిమిత స్థాయిలో సఫారీని ప్రారంభించారు. బఫర్ జోన్లో 33 కిలోమీటర్ల సఫారీ మార్గాన్ని గుర్తించగా, ప్రస్తుతానికి ఉల్లూరు గ్రామం నుంచి దండపర్తి వరకు 9 కిలోమీటర్ల మేర మార్గాన్ని సిద్ధం చేశారు. పర్యాటకుల కోసం నాలుగు జిప్సీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో వాహనానికి రోజువారీ సఫారీ రుసుము రూ. 2,000గా నిర్ణయించారు. పర్యాటకుల స్పందనను బట్టి భవిష్యత్తులో వాహనాల సంఖ్యను, మరిన్ని కొత్త రూట్లను పెంచనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ (వన్యప్రాణుల విభాగం) ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి (PCCF) ఓపీ యాదవ్ తెలిపారు.
Also Read
- Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
- BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
- Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ పర్యాటక ప్రాజెక్ట్ ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్థానిక యువతను సఫారీ డ్రైవర్లుగా, గైడ్లుగా నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పర్యాటకులు అడవి విశేషాలను స్థానికుల ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా హోమ్‌స్టేలు, స్థానిక హస్తకళలు, బస్తర్ ఆర్ట్, సాంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తూ అక్కడి గ్రామస్తుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. ఇంద్రావతి నది ఒడ్డున ఉన్న మధి మార్ఖా ప్రాంతం, దట్టమైన అడవుల మధ్య 300 అడుగుల ఎత్తులో ఉన్న నంబి జలపాతం వంటి ప్రకృతి అందాలను ఈ పర్యాటక సర్క్యూట్లో చేర్చారు. వన్యప్రాణుల సంరక్షణకు ఆటంకం కలగకుండా, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!