ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగరతనని అన్నట్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాలో రేపో అంతరించి పోయే పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. లోక్ సభ లో ప్రతిపక్ష హోదా లేని పార్టీ బీజేపీ గురించి మాట్లాడుతుందని, పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కు ఎమ్మెల్యే లు లేరన్నారు. వంశ పారంపర్యంగా , ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యారని, దాన్ని కనీసం నిలబెట్టుకోలేక అస్త్ర సన్యాసం చేశారన్నారు.
Also Read : GDP Growth: 2000 – 2020 మధ్య అత్యధిక జీడీపీ గ్రోత్ కలిగిన టాప్-10 దేశాలు
భారత రాజకీయాల్లో ఉత్తర కుమారుడు రాహుల్ గాంధీ అని, బీజేపీనీ కనుమరుగు చేస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్ట్ లు కలిసి పోటీ చేసిన తెలంగాణలో బీజేపీ అధికారం లోకి వస్తుందన్నారు. అమెరికాలో అయన కార్యక్రమం లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు వస్తె కనీసం ప్రొటెస్ట్ చేయని దద్దమ్మ రాహుల్ గాంధీ అని, అయన కార్యక్రమాలని ఆర్గనైజ్ చేస్తుంది ఈ దేశాన్ని ముక్కలు చేయాలని అనుకునే వారన్నారు. కాంగ్రెస్ పార్టీ నీ భూస్థాపితం చేయాలని సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయని, తెలంగాణ లో కాంగ్రెస్ కన్నా బీజేపీ ముందు ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదన్నారు.
Also Read : Bollywood : సోషల్ మీడియా ద్వారా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ బ్యూటిస్ వీరే..
