NTV Telugu Site icon

Indrakaran Reddy: కాంగ్రెస్‌, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు.. మూడోసారి కేసీఆరే సీఎం..

Indrakaran Reddy

Indrakaran Reddy

నిర్మల్ జిల్లాలోని చించోలి – బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు బకాయిలాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ మోట‌ర్లకు మీట‌ర్లు పెట్టాల‌ని ఒత్తిడి చేస్తే.. నా తెల తెగి ప‌డినా స‌రే మీటర్లు పెట్టనివ్వను అని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు.

Read Also: Kareena Kapoor : రెడ్ డ్రెస్సులో హాట్ లుక్ లో కరీనా కపూర్.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ ..

దేశ వ్యాప్తంగా రాష్ట్రాల‌న్ని మోటర్లకు మీటర్లు పెడుతున్నా.. కేంద్రాన్ని ఎదిరించి రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక సీఎం కేసీఆరే అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మీట‌ర్లు పెట్టడం లేదని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధుల‌ను ఆపేసింద‌ని వివ‌రించారు.. కాంగ్రెస్‌, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు అందించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు చీకట్లలో గడిపారని, వ్యవసాయానికి విద్యుత్‌ అందించలేదని మంత్రి తెలిపారు. విత్తనాల కోసం, కరెంట్ కోసం ధర్మాలు చేసి పోలీస్ స్టేషన్ కు పోయిన రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న రైతులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు బాగుపడుతుంటే చూడలేని వారికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.