Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Indonesia Plans To Buy Indias Brahmos Missile Defence Deal Likely Soon

BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!

Published Date :March 10, 2026 , 7:34 am
By Kothuru Ram Kumar
  • తీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు..
  • ఇండోనేషియా భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలని నిర్ణయం..
  • వచ్చే 2–3 నెలల్లో భారత్-ఇండోనేషియా మధ్య అధికారిక ఒప్పందం..
BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

BrahMos Deal: ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా దేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Add as a preferred
source on google

సమాచారం ప్రకారం మొదటి దశలో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్యాటరీని కొనుగోలు చేయనుంది. అనంతరం దానిని దశలవారీగా పెంచే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే రెండో దేశంగా ఇండోనేషియా నిలుస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఇండోనేషియా రక్షణ మంత్రి స్యాఫ్రి స్యామ్‌సోయెద్దీన్ భారత్‌ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని సందర్శించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు బ్రహ్మోస్ క్షిపణి మోడల్‌ను బహుమతిగా అందజేశారు. ఈ పర్యటన అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో బ్రహ్మోస్ క్షిపణి మూడు బ్యాటరీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిగా గుర్తింపు ఉంది. ఇందులో ఎగుమతి వర్షన్ సుమారు 290 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది యాంటీ-షిప్, భూభాగంపై దాడులు, తీర రక్షణ వంటి అనేక మిషన్లలో ఉపయోగించవచ్చు. శబ్ద వేగానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BrahMos cruise missile
  • BrahMos export news
  • brahmos missile
  • India Indonesia defence deal
  • Indonesia BrahMos deal

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions