Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. కోటి మంది మహిళలకు కోటి చీరలు.. ఎవరు అర్హులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indiramma Sarees Distribution: తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇందిరమ్మ చీరలను కానుకగా అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను అందిస్తోంది.
గ్రామీణ మహిళలకు 65 లక్షలు:
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. చీరల తయారీలో నాణ్యత, మన్నికకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలోనూ ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు.
Also Read
- Kishan Reddy: దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ డ్రగ్స్.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి!
- టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
- Tollywood: స్టార్ హీరోలు తడబడితే యంగ్ హీరోలు నిలబెట్టారు.!
- JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే రాజీనామా చేయిస్తా..! సర్పంచ్లకు జేసీ వార్నింగ్
రెండు రకాల చీరలు.. ప్రత్యేక డిజైన్లు:
మొత్తం కోటి చీరల్లో 95 లక్షల పాలిస్టర్ చీరలు 6.30 మీటర్ల పొడవుతో ఉండగా.. మరో 5 లక్షల పాలీకాటన్ చీరలను 9 మీటర్ల పొడవుతో తయారు చేశారు. మహిళలకు నచ్చేలా ఆకర్షణీయమైన డిజైన్లతో వీటిని రూపొందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులతోనే ఈ చీరలను తయారు చేయించారు. మహిళలకు కానుకగా చీరలు అందించడంతో పాటు స్థానిక నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఎవరెవరు అర్హులు?:
రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ ఇందిరమ్మ చీరలు పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన మహిళలు తమ ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం జరగనుంది. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను పంపిణీ చేయనున్నారు. పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. ఇందులో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయనున్నారు. ఈ నెల 26న అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందనున్నాయి.
తాజావార్తలు
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. కోటి మంది మహిళలకు కోటి చీరలు.. ఎవరు అర్హులు?
-
Kishan Reddy: దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ డ్రగ్స్.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
Sonia Gandhi: ‘నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు’.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood: స్టార్ హీరోలు తడబడితే యంగ్ హీరోలు నిలబెట్టారు.!
ట్రెండింగ్
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!