Indiramma Amrutam : ఇందిరమ్మ అమృతం.. బాలికల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం
- రక్తహీనతపై యుద్ధానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
- పిల్లల ఆరోగ్యానికి పోషక చిక్కీలు
- అంగన్వాడీ ద్వారా ఉచిత పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indiramma Amrutam : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో, కౌమార బాలికలలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ‘‘ఆడపిల్లలకు శక్తినిద్దాం… ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’’ అనే నినాదంతో ‘‘ఇందిరమ్మ అమృతం’’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 14 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి బాలికకు నెలకు 30 చిక్కీలు ఇవ్వబడతాయి. ఒక్కో చిక్కీలో సుమారు 600 కేలరీల శక్తి, 18–20 గ్రాముల ప్రొటీన్లు, అవసరమైన మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి.
Kannappa: కన్నప్ప హార్డ్ డిస్క్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతం
Also Read
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మొత్తం 50,269 బాలికలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్న నేపథ్యంలో, ఈ పథకం ప్రాధాన్యతను సంతరించుకుంది. పథకాన్ని అధికారికంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఈ కార్యక్రమం ద్వారా పోషకాహారంపై అవగాహన, బాల్య వివాహాల నివారణ, జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు కూడా అందించనున్నారు.
Babylon Pub : బేబిలాన్ పబ్‌లో దారుణ ఘటన.. లైట్స్ ఆపి తన తల్లి, చెల్లిని…
తాజావార్తలు
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?