Indiramma Amrutam : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో, కౌమార బాలికలలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ‘‘ఆడపిల్లలకు శక్తినిద్దాం… ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’’ అనే నినాదంతో ‘‘ఇందిరమ్మ అమృతం’’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 14 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలు ఉచితంగా…