Indigo Emergency: జస్ట్ మిస్.. ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
- ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ..
- ఇండిగో ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Emergency: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ఇంజిన్ ఫెయిల్ అయినట్లు అనుమానం రావడంతో రన్‌వే 28 వద్ద ‘ఫుల్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ, పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. విమానాశ్రయ అధికారుల సమన్వయంతో ఉదయం 10:54 గంటలకు రన్‌వే 28పై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రన్‌వే పొడవునా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
- Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
- Mohammad Kaif: సిరాజ్‌ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
- Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
ఊపిరి పీల్చుకున్న 161 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత వెంటనే ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక తనిఖీల అనంతరం వారిని గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపానికి గల కారణాలపై ఇండిగో యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది. విమానాశ్రయ యంత్రాంగం, పైలట్ అప్రమత్తత వల్లనే ఒక భారీ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్‌ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!