Indigo Emergency: జస్ట్ మిస్.. ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
- ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ..
- ఇండిగో ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Emergency: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ఇంజిన్ ఫెయిల్ అయినట్లు అనుమానం రావడంతో రన్‌వే 28 వద్ద ‘ఫుల్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ, పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. విమానాశ్రయ అధికారుల సమన్వయంతో ఉదయం 10:54 గంటలకు రన్‌వే 28పై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రన్‌వే పొడవునా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
Also Read
- Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
- Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ఊపిరి పీల్చుకున్న 161 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత వెంటనే ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక తనిఖీల అనంతరం వారిని గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపానికి గల కారణాలపై ఇండిగో యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది. విమానాశ్రయ యంత్రాంగం, పైలట్ అప్రమత్తత వల్లనే ఒక భారీ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
-
Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
-
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!