NTV Telugu Site icon

IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు!

Indigo Flight

Indigo Flight

Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్‌) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

6E 6341 నంబర్ ఇండిగో విమానం మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో ఫ్లైట్ చెన్నైలో ల్యాండ్‌ అవుతుందనగా.. ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు భయపడిపోయారు. కొందరు గట్టిగా కేకలు కూడా వేశారట. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. విమాన సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఖాళీ స్టేడియంలోనే ప్రపంచకప్‌ మ్యాచ్!

ఇండిగో విమానం చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వగానే.. ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారులు సదరు వ్యక్తిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐఎస్‌ఎఫ్‌ విచారణ చేపట్టింది. ఆ వ్యక్తిని మణికందన్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments