ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న ఇండిగో విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో కరాచీలోని జిన్నా విమానాశ్రయం నుండి సహాయం కోరింది. దీంతో.. పాకిస్తాన్ CAA వైద్య బృందం విమానానికి సహాయం అందించడానికి అంగీకరించింది.
Read Also: Game Changer: గేమ్ ఛేంజర్ లేటు కావడానికి అసలు కారణం ఇదే!
ఓ వార్త కథనం ప్రకారం.. ప్రయాణీకుడు 55 ఏళ్ల భారతీయ వ్యక్తి. అతనికి విమానంలో ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ పైలట్ కరాచీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాడు. “ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మానవతా ప్రాతిపదికన కరాచీలో ఇండిగో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించింది. అక్కడ ప్రయాణీకుడికి అత్యవసర చికిత్స అందించడానికి ఒక వైద్య బృందాన్ని విమానంలోకి పంపారు” అని అతను చెప్పాడు. విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సమస్య పరిష్కరించబడిన తరువాత.. విమానం కరాచీ నుండి బయలుదేరి జెడ్డాకు వెళ్లకుండా న్యూఢిల్లీకి తిరిగి వచ్చిందని నివేదిక పేర్కొంది.
Read Also: LK Advani: ఎల్‌కే అద్వానీ హెల్త్ బులెటిన్ విడుదల..