NTV Telugu Site icon

IND vs SA: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టెస్టు.. సమం చేస్తారా.. సమర్పించుకుంటారా..?

Ind Vs Sa

Ind Vs Sa

తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్‌ గెలిచేందుకు బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా పోటీ పడబోతున్నాయి. భారత్‌ మ్యాచ్‌ ఓడినా, ‘డ్రా’ అయినా సిరీస్‌ను కోల్పోతుంది. కాబట్టి సమం చేయాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే..

Read Also: UK: 16 ఏళ్ల బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు..

అయితే, తొలి టెస్టులో ఒక్కో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, సెకండ్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి ప్రదర్శన మినహా చెప్పుకోవడానికేమీ ఇంకా ఏమి లేదు.. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్‌ అయ్యర్ ల బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ పరాజయంలో ఒక కారణంగా చెప్పవచ్చు.. కెప్టెన్ రోహిత్‌ కూడా విఫలం కావడం టీమ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్‌ రికార్డు చాలా పేలవంగా ఉంది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 128 పరుగులే చేశాడు. కాగా, గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడటం జట్టుకు కలిసొచ్చే అంశం. జడేజా కోసం అశ్విన్ న్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.. అయితే ఆల్‌రౌండర్‌గా శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Oyo : న్యూ ఇయర్ నాడు రికార్డు బ్రేక్.. గోవా కాదు అయోధ్య ఫస్ట్ ఛాయిస్

బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైన ఠాకూర్ స్థానంలో రెగ్యులర్‌ పేస్‌ బౌలర్‌ను తీసుకోవాలా లేక అశ్విన్‌ను రెండో స్పిన్నర్‌గా కొనసాగించాలా అనే దానిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చర్చిస్తుంది. టాపార్డర్‌ విఫలమైతే చివర్లో కొన్ని రన్స్ కావాలంటే శార్దుల్‌ ఠాకూర్ సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌పరంగా భారత్‌ పటిష్ట స్థితిలోనే కనిపిస్తున్నా… బౌలింగ్‌లో రాణిస్తేనే విజయావకాశాలు ఉంటాయి.

Read Also: YSR Pension Kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. నేడు కాకినాడకు సీఎం.. మళ్లీ గెలిస్తే రూ.4వేల పెన్షన్‌..

మరోవైపు సౌతాఫ్రికా మార్క్‌రమ్‌తో పాటు పీటర్సన్‌ కూడా రాణిస్తే భారీ స్కోరు ఖాయం. గాయపడి మ్యాచ్‌కు దూరమైన బవుమా స్థానంలో హమ్జాకు స్థానం సంపాదించుకున్నాడు. బౌలింగ్‌లో సఫారీ మరింత పదునుగా కనపడుతుంది. ఈ గ్రౌండ్ లో 20.95 సగటుతో 42 వికెట్లు తీసిన ఘనమైన రికార్డు రబడ సొంతం. బర్గర్‌ తొలి టెస్టులోనే సత్తా చాటాడు.. గాయపడిన కొయెట్జీ స్థానంలో ఎన్‌గిడి తిరిగి జట్టులోకి వస్తాడు. భారత్‌ను ఈ పేస్‌ బలగం తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్పిన్నర్‌ లేకుండా టీమ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై పచ్చిక కనిపిస్తోంది. తొలి రోజు వాతావరణాన్ని బట్టి చూస్తే సీమర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉండనుంది.