Site icon NTV Telugu

Asian Games 2023: స్క్వాష్‌లో భారత్ రికార్డ్.. పసిడి పతకం సాధించిన ఇండియా

Squash

Squash

ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్‌లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్‌లో భారత్‌ పతకం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అభయ్‌సింగ్‌ పాకిస్థాన్‌కు చెందిన జమాన్‌ నూర్‌పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు మ్యాచ్‌లో మహమ్మద్ అసిమ్ ఖాన్‌ను ఓడించి సౌరవ్ ఘోషల్ 1-1తో భారత్‌ను డ్రాగా ముగించాడు.

Read Also: Rs.2000 note exchange: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ

మరోవైపు భారత స్క్వాష్‌ జట్టు ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌ ఓటమితో ప్రారంభమైంది. నాసిర్ ఇక్బాల్‌తో జరిగిన సెట్లలో మహేష్ మంగనవార్ ఓడిపోయాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో భారత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్ అద్భుతంగా ఆడి జట్టును సమస్థితికి తీసుకొచ్చాడు. మూడో మ్యాచ్‌లో అభయ్ సింగ్ విజయం సాధించడంతో స్క్వాష్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంతకుముందు గ్రూప్ దశలో.. స్క్వాష్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

Read Also: Minister Botsa: చంద్రబాబుపై చాలా కేసులున్నాయి.. జనసేన-టీడీపీ కలిసొచ్చిన నష్టం లేదు..

ఇప్పటివరకు భారత్ ఖాతాలో 10 బంగారు పతకాలు, 13 రజతాలు, 13 కాంస్య పతకాలు చేరాయి. దీంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 36కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఏడో రోజు ఆరంభం భారత్‌కు చాలా బాగుంది. మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోంస్లే జోడీ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

Exit mobile version