Site icon NTV Telugu

Team India: న్యూజిలాండ్తో ఇండియా మ్యాచ్.. ధర్మశాలకు చేరుకున్న టీమిండియా

Team India Reache

Team India Reache

Team India: వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసం టీమిండియా నేడు ధర్మశాలకు చేరుకుంది.

Read Also: Kerala High Court: మహిళలు తమ తల్లి లేదా అత్తగారికి బానిసలు కాదు.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పూణే నుంచి స్పెషల్ ఫైట్ లో ధర్మశాలలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వారికి కేటాయించిన హోటల్ కు చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ట్రావెల్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇదిలా ఉంటే రేపు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొననున్నారు. మరోవైపు ధర్మశాలలోనే ఉన్న న్యూజిలాండ్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

Read Also: AP Government: జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం

కాగా.. టోర్నీలో టీమిండియా-న్యూజిలాండ్ నాలుగేసి విజయాలతో పాయింట్ల పట్టికలో పైనే ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఈ రెండు జట్టు తలపడినప్పుడు కివీస్ విజయం సాధించింది. అయితే ఎల్లుండి జరిగే మ్యాచ్ లో భారత్ కివీస్ ను ఓడించి విజయాల పరంపర కొనసాగిస్తుందా.. లేదా విజయాలకు అడ్డుకట్ట వేస్తుందా అనేది చూడాలి.

Exit mobile version