Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Indias First Lpg Atm Launched Gurugram Bpcl How To Use

BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!

Published Date :March 19, 2026 , 12:28 pm
By Shiva Ganesh
BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

BPCL LPG ATM: యుద్ధ మేఘాల వల్ల దేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది.

READ ALSO: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!

ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభం అని అధికారులు చెబుతున్నారు. ముందుగా యూజర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటిపి (OTP)ని ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత వారి పాత సిలిండర్‌పై ఉన్న బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఇప్పుడు యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించాలి. తర్వాత పాత ఖాళీ సిలిండర్‌ను మిషన్ లోపల ఉంచగానే, కేవలం 2-3 నిమిషాల్లో నిండుగా ఉన్న కొత్త సిలిండర్ బయటకు వస్తుంది.

ఈ ఏటీఎం ద్వారా లభించే సిలిండర్లు మనం రెగ్యులర్‌గా వాడే ఇనుప సిలిండర్లు కావు. ఇవి ఫైబర్ ఆధారిత ‘కంపోజిట్ సిలిండర్లు’. సాధారణ సిలిండర్ బరువు (గ్యాస్‌తో కలిపి) 31 కిలోలు ఉంటే, ఈ కంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఇవి చాలా తేలికగా ఉండటంతో ఎవరైనా సులభంగా మోసుకెళ్లవచ్చు, అలాగే ఇవి వాడకంలో కూడా అత్యంత సురక్షితమైనవిగా చెబుతున్నారు.

24/7 అందుబాటులో సేవలు
ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటు పనిచేస్తుంది. గ్యాస్ ఏజెన్సీలతో పని లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. మిషన్‌లో గ్యాస్ స్టాక్ తగ్గిపోగానే, ఆటోమేటిక్‌గా సమీప ఏజెన్సీలకు అలర్ట్ వెళ్లి స్టాక్ రీఫిల్ అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలపై వినియోగదారుల ఆధారితాన్ని తగ్గించడం, యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో కూడా గ్యాస్ సరఫరాను సాఫీగా సాగించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.

READ ALSO: PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 24/7 Gas cylinder booking
  • Automatic Gas Vending Machine
  • BPCL LPG ATM Gurugram
  • BPCL Pilot Project Gurugram
  • Composite Gas Cylinder Benefits

తాజావార్తలు

  • BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!

  • AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!

  • Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions