Site icon NTV Telugu

ICE Cafe: 14 వేల అడుగుల ఎత్తులో ఐస్ కేఫ్ నిర్మాణం.. ఎక్కడో తెలుసా..?

Ice Cafe

Ice Cafe

సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన భారత దేశపు మొట్ట మొదటి ఐస్ కేఫ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్ లో ఈ ఐస్ కేఫ్‌ను రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో.. అదే సమయంలో లడక్ ప్రాంతంలో మాత్రం చలి మంచు కమ్మేస్తోంది. ఈ క్రమంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవలే అద్భుతమైన ఐస్ కాఫీ కేఫ్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

Read Also: K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ భహిరంగ సభ విఫలమైంది..

అయితే, ఈ ఐస్ కాఫీ కేఫ్‌లో సాంప్రదాయ నూడుల్స్, వివిధ రకాల వేడి పానీయాలను అందించనున్నారు. మంచుతో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన కేఫ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని, అనుభవించని విధంగా రూపొందించారు. ఈ కృత్రిమ, సహజమైన హిమానీనదం మంచు గడ్డలతో తయారు చేశారు. ఈ మంచు గడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.

Exit mobile version