NTV Telugu Site icon

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ జట్ల మధ్యే.. టీమిండియా మాజీ క్రికెటర్ జోస్యం

Wtc Final

Wtc Final

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఇంగ్లండ్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. తాజాగా బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ను ఓడించి టాప్-5లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని ప్రతి జట్టు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి డబ్ల్యూటీసీలో ఏ రెండు జట్లు ఫైనల్ ఆడతాయో క్రికెట్ పండితుల అంచనా ప్రక్రియ మొదలైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ టైటిల్ మ్యాచ్ ఈసారి జూన్ 11-15 మధ్య లార్డ్స్ మైదానంలో జరగనుంది. దీనిని ‘మక్కా ఆఫ్ క్రికెట్’ అని పిలుస్తారు. టైటిల్ మ్యాచ్‌కి జూన్ 16 రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగల టీమ్లు ఏంటో చెప్పాడు.

Read Also: Delhi: కాంగ్రెస్‌లో చేరిన భారత రెజర్లు వినేష్ ఫోగట్, పునియా.. హర్యానా నుంచి బరిలోకి..!

WTC 2023-25 ​​టైటిల్ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మరోసారి ఢీకొంటాయని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు టీమిండియా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడింది. అయితే.. రెండు సార్లు టీమిండియా ట్రోఫీని అందుకోలేకపోయింది. మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ ఓడించగా.. రెండోసారి కంగారూల చేతిలో పరాజయం పాలైంది.

Read Also: Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే..

క్రిక్‌బజ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుందని నేను భావిస్తున్నాను. భారత్‌కు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం. రెండేళ్ల క్రితం వారు ఓవల్‌లో మమ్మల్ని ఓడించారు. ఈ అవకాశం 2025లో రాబోతుంది. ఇది మళ్లీ రాబోతోంది. భారత్ ఆ అడ్డంకిని దాటాలని.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.” అని దినేష్ కార్తీక్ చెప్పాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ 68.52 శాతం పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మరోసారి ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.