Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
- టెక్ లేఆఫ్స్‌తో భారతీయ అమెరికన్లలో భయం..
- ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లలో ఆందోళన..
- ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. తాజాగా మెటా 8000 మందిని తొలగించింది. అమెజాన్ దశల వారీగా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఒక 2026లో ఇప్పటి వరకు లక్ష మంది జాబ్స్ పోయాయి. ఈ నేపథ్యంలో టెక్కీలు దినదిన గండం నూరేళ్ల ఆయష్షుగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో అని భయపడుతున్నారు. ఒకప్పుడు అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే యువతకు ఒక డ్రీమ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రావడంతో అన్ని కంపెనీలు కూడా ఏఐపై భారీగా పెట్టుబడుతు పెడుతున్నాయి. ఇక ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి.
యూఎస్‌లో ఉంటున్న భారతీయుల్లో ఆందోళన..
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
ఇదిలా ఉంటే, ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా H-1B వీసాలపై పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. ఒక వేళ అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయలు ఉద్యోగాన్ని కోల్పోతే, 60 రోజుల్లో కొత్త కంపెనీ స్పాన్సర్ దొరకకపోతే అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
రిస్క్‌లో H-1B ఉద్యోగులు..
ఇది కేవలం ఒక ఉద్యోగంపైనే ప్రభావం చూపించడం లేదు. ఉద్యోగం చేస్తున్నామనే ధీమాలో చాలా మంది ఇంటి లోన్, కార్ లోన్, పిల్లల చదువులు, అమెరికాలో ఉండే హక్కు ఇలా అన్ని కూడా రిస్క్‌లో పడుతున్నాయి. దీంతో చాలా మంది తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం.. H-1B ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే, 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించాలి, కొత్త కంపెనీ వీసా స్పాన్సర్ చేయాలి, లేదంటే దేశం విడిచి వెళ్లాలి.
ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు..
ఇదే సమయంలో కొంతమంది ఉద్యోగులు మరికొంత సమయం పొందేందుకు తాత్కాలికంగా B-2 వీసాకు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో అమెరికాలో మరో 6 నెలలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, దీనికి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదనపు డాక్యుమెంట్లు అడగటం, ఎక్కువగా విచారణ చేయడం, అఫ్లికేషన్స్ రిజెక్ట్ చేయడం వంటిని జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను చూసుకుంటున్నారు. కెనడా, యూరప్ దేశాలకు వెళ్లడం లేదా భారత్ తిరిగి వచ్చేయాలా? అని ఆలోచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్‌టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!