NTV Telugu Site icon

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు..

Indian Women's Table Tennis

Indian Women's Table Tennis

పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్‌లో శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు అమెరికా లేదా జర్మనీతో పోటీ పడే అవకాశం ఉంది.

Bangladesh: షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో సంబరాలు.. వీధుల్లో నిరసనకారులు కేరింతలు

ఈ మ్యాచ్‌లో శ్రీజ, అర్చన జోడీ తొలుత డబుల్స్‌లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఈ భారత జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించి ముందంజ వేసింది. ఈ భారత జోడీ 11-9, 12-10, 11-7 తేడాతో ఎడినా, సమారాపై విజయం సాధించింది. ఆ తర్వాత.. మణిక తదుపరి మ్యాచ్‌లోకి ప్రవేశించింది. ఆ మ్యాచ్ లో బెర్నాడెట్‌ను 3-0తో సులభంగా ఓడించింది. మణికా 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్‌ను ఓడించింది. దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Bangladeshi PM Reaches India: అగర్తలకు చేరుకున్న షేక్ హసీన.. నిర్ధారించిన త్రిపుర పోలీసులు

తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మూడో మ్యాచ్‌లో వెనుదిరిగింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన ఉత్కంఠ సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీజ ఆకుల ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సమర 3-2తో శ్రీజను ఓడించింది. శ్రీజ, సమర మధ్య జరిగిన మ్యాచ్ లో 8-11, 11-4, 7-11, 11-6, 11-8 తేడాతో సమర గెలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీజ ఓడిపోయినప్పటికీ, రొమేనియాపై భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత.. బెర్నాడెట్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అర్చన కామత్ 3-1 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అర్చన 5-11, 11-8, 7-11, 9-11 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో.. భారత్, రొమేనియా మధ్య స్కోరు 2-2తో సమమైంది. కాగా.. చివరి మ్యాచ్‌లో మ్యాచ్ ఫలితం డిసైడ్ అయింది. ఈ మ్యాచ్‌లో మనిక 3-0 (11-5, 11-9, 11-9)తో ఎడినా డియాకానును ఓడించింది.

Show comments