Site icon NTV Telugu

T20 World Cup: టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన..

T 20 World Cup

T 20 World Cup

టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమై జట్టును ప్రకటించింది.

కాగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వైట్ బాల్ క్రికెట్‌లో మూడో ప్రపంచకప్ ఆడనుంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ సేన.. ఫైనల్‌ వరకు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. రోహిత్ మరోసారి నమ్మకం ఉంచిన బీసీసీఐ.. అతని సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలవాలని చూస్తోంది.

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, చాహల్, సిరాజ్, అర్ష్ దీప్ సింగ్.

ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: శుభ్ మాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

జట్టులో ఇంకా మార్పు ఉందా?
మెగా టోర్నీలో జూన్ 5న ఐర్లాండ్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో.. జూన్ 25 వరకు భారత జట్టు తన జట్టులో మార్పులు చేయవచ్చు. అందుకోసం ICC నుండి అనుమతి తీసుకోవాలి. గాయం ఉన్నప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది. ఈ నియమం టోర్నమెంట్‌లోని ప్రతి జట్టుకు వర్తిస్తుంది.

టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ షెడ్యూల్
జూన్ 5- భారత్ vs ఐర్లాండ్.
జూన్ 9- భారత్ vs పాకిస్థాన్.
జూన్ 12- భారత్ వర్సెస్ అమెరికా.
జూన్ 15- భారత్ vs కెనడా.

 

Exit mobile version