Site icon NTV Telugu

Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థిని మృతి

Canada

Canada

కెనడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బస్టాప్ లో బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన సమయంలో ఆ విద్యార్థినికి తూటా తగలడంతో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థిని హర్‌సిమ్రత్‌ రంధావా గుర్తించారు. ఆమె కెనడాలోని ఒంటారియోలోని మేహాక్ కళాశాలలో చదువుతోంది. హామిల్టన్ పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు.. ఇవాళ విచారణకు హాజరుకానున్న ఎంపీ మిథున్ రెడ్డి..

హర్‌సిమ్రత్‌ మృతిపై భారత కాన్సులేట్‌ జనరల్‌ సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాన్ని సంప్రదిస్తున్నామని.. అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి సంతాపం ప్రకటించారు. హర్‌సిమ్రత్‌ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన గురించి హామిల్టన్ పోలీసులు మాట్లాడుతూ.. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ హత్య గురించి మాకు సమాచారం అందిందని తెలిపారు.

Also Read:HIT 3 : ‘హిట్ 3’ ప్రమోషన్స్‌ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్న నాని.!

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, హర్‌సిమ్రత్‌ రంధావా అపస్మారక స్థితిలో ఉన్నారని, ఛాతీపై గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వెల్లడించారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. అందులో నల్లటి కారులో కూర్చున్న వ్యక్తి హర్‌సిమ్రత్‌ను కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడని తేలింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version