Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Indian Scientist Himanshu Kulkarni Wins International Water Award 2025

Himanshu Kulkarni: చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్త.. 16 ఏళ్లలో ఫస్ట్ టైం..

Published Date :September 22, 2025 , 9:46 pm
By Shiva Ganesh
Himanshu Kulkarni: చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్త.. 16 ఏళ్లలో ఫస్ట్ టైం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Himanshu Kulkarni: భారతదేశ శాస్త్రవేత్త చరిత్ర సృష్టించారు. నిజంగా ఇదో చారిత్రాత్మక మైలురాయి. పూణేకు చెందిన జలవనరుల నిపుణుడు డాక్టర్ హిమాన్షు కులకర్ణి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జల బహుమతిని గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన USA ఒక్లహోమా విశ్వవిద్యాలయం WATERCenter ఆధ్వర్యంలో అందజేస్తున్న ఈ అవార్డును అందుకున్నారు. ఈ సంస్థను 2009లో స్థాపించారు. భారతదేశం తరుఫున 16 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారి ఆయన ఈ అవార్డ్ గెలుచుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Tollywood: అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్న హీరోలు

ఆయన ఎవరు..
చాలా కాలంగా భూగర్భ జల నిర్వహణ, సంబంధిత విభాగాలపై డాక్టర్ హిమాన్షు కులకర్ణి పనిచేశారు. ఆయన నీతి ఆయోగ్ 12వ ప్రణాళిక వర్కింగ్ గ్రూప్‌కు సహ ఛైర్మన్‌‌గా కూడా పనిచేశారు. అలాగే జాతీయ జలాశయ మ్యాపింగ్ ప్రోగ్రామ్ ముసాయిదా రూపకల్పనకు కృషి చేశారు. ఆయన ప్రస్తుతం శివ్ నాదర్ విశ్వవిద్యాలయంలో గ్రామీణ నిర్వహణలో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా, ఐఐటీ బాంబే, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తు్న్నారు. భారతదేశంలో భూగర్భ జలాల సంక్షోభాన్ని సమాజ భాగస్వామ్యం, భాగస్వామ్య వనరుల నిర్వహణ ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చని డాక్టర్ హిమాన్షు కులకర్ణి విశ్వసిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ACWADAM (అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్) ద్వారా అనేక ప్రాంతాలలో స్థానిక సమాజాలను నీటి నిర్వహణలో భాగస్వాములను చేశారు. ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను ఒక సాధారణ వనరుగా నిర్వహించడం ద్వారా మాత్రమే నీటి సంక్షోభాన్ని పరిష్కరించవచ్చని చెబుతున్నారు.

ఈ బహుమతి స్పెషల్ ఏంటి..
ఈ అవార్డును ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ప్రదానం చేస్తారు. పరిశోధన, విద్య లేదా సామాజిక సేవ ద్వారా నీటి నిర్వహణకు దోహదపడే శాస్త్రవేత్తలను దీనితో సత్కరిస్తారు. ఈ బహుమతిని ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. ఈ అవార్డ్‌ను డాక్టర్ హిమాన్షు కులకర్ణికి 2024 సంవత్సరానికి గాను ప్రకటించారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15, 2025న జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఆయనకు అవార్డును అందజేశారు. బహుమతిలో ట్రోఫీ, US$25,000 నగదు బహుమతిని ఆయనకు అందజేశారు.

READ ALSO: Kurnool Supari Murder: దాయాదుల దారుణం.. సుపారి ఇచ్చి మరీ హత్య

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACWADAM
  • groundwater expert India
  • Himanshu Kulkarni award
  • Indian scientist water award
  • International Water Award 2025

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీఎల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions