Vande Bharat Sleeper Trains: భారతదేశంలో చాలామంది ప్రజలు సుధీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ఎక్కువమంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దీనికి కారణం రైలు ప్రయాణం అయితే ప్రశాంతంగా పడుకుని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రైలు ప్రయాణం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకునేందుకు బాగానే వినియోగిస్తున్నారు.
Harish Rao: మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇవే.. సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ..
ఇకపోతే ఈ వందే భారత్ రైళ్లలో ఇదివరకు కేవలం చైర్ కార్ సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ట్రైన్లలో ఎటువంటి స్లీపర్ కోచులు లేవు. తాజాగా ఈ వందే భారత్ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్ లను తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్. ఇందుకు సంబంధించి మొదటి వందే భారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుండి మొదలుపెట్టాలని భారతీయ రైల్వే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతనే మిగతా రూట్స్ లో వందే భారత్ స్లీపర్ వైర్లను మొదలుపెట్టనున్నారు. అది కూడా ఆగష్టు 15 న మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
Deputy CM Pawan: చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం..
ఇందుకు సంబంధించి వందే భారత్ స్లీపర్ రైళ్లను సికింద్రాబాద్ – ముంబై పట్టణాల మధ్య మొదలుపెట్టాలని భారత రైల్వే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదివరకు ఈ రూట్లో ఎటువంటి వందే భారత్ రైలు లేదు. కాబట్టి నేరుగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ కు సూచించారని సమాచారం. ఈ నేపధ్యం లోనే ఈ ఆలోచనను రైల్వే బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఇదివరకు సికింద్రాబాద్ – పూణే నగరాల మధ్య వందే భారత్ రైలు మొదలు అవుతుందన్న వార్తలు వచ్చాయి కానీ.. అది మాత్రం కార్యాచరణ కాలేదు. ఇప్పటికే హైదరాబాద్ నుండి 3 రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ – యశ్వంతపుర, సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – విశాఖపట్నం రూట్ లలో ఈ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇదే కాకుండా అతి త్వరలో మరో రెండు వందే భారత్ రైళ్లు హైదరాబాద్ నుండి మొదలు కాబోతున్నాయని సమాచారం.