Indian railways Jobs 2024: ఇండియన్ రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది.. వేల సంఖ్యలో ట్రైన్ డ్రైవర్ అంటే అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలోనూ ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 19వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అర్హతలు, జీతం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు..5,696
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు కనీసం ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఏఐసీటీటీ గుర్తింపు ఉన్న ఏదైనా విద్యాంస్థ నుంచి పైన పేర్కొన్న బ్రాంచ్‌లలోనే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు..
వయస్సు..
18ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. అయితే కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది..
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.. జనవరి 20నుంచే ఆన్‌లైన్లో సైట్ ఓపెన్ అయ్యింది. ఫిబ్రవరి 19 వరకూ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు అభ్యర్థులకు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్-సర్మీస్‌మెన్‌తోపాటు మహిళలకు రూ.250.. మిగిలిన వారికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది..
వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే వేతనం రూ. 19,900 ఉంటుంది. గరిష్టంగా రూ. 63,200 వరకూ పెరుగుతుంది..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..
తాజావార్తలు
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!