NTV Telugu Site icon

IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!

Irctc

Irctc

సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు.  ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

అయితే ప్రయాణికులు బుకింగ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత అంటే 14 రోజులలోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బుక్ నౌ, పే లేటర్ సదుపాయంతో ఇకపై మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నప్పుడు, టికెట్ బుక్ చేసుకునేందుకు తగినంత డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది.

టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు..

టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC యాప్ లేదా సైట్‌కి వెళ్లి లాగిన్ కావాలి. బుక్ నౌ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన వివరాలను, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో క్రెడిట్, డెబిట్, BHIM యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేసి టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

పే లేటర్ ఫీచర్ ను యూజ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందు ఈ పేలేటర్ ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్ పేజీలో పే లేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా జీరో పేమెంట్ తో టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. లేకపోతే 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.