ఇండియన్ రైల్వేస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను పెంచింది. వివిధ కేటగిరీల రైళ్లలో ధరలు పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి. ఈ కొత్త మార్పు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్లలో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500ల కి.మి దాటితేనే పెరుగుదల వర్తిస్తుంది.
READ MORE: Donald Trump: తొలిసారి మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
ఉదాహరణకు… ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు రాజధాని రైలు ఛార్జీ రూ.2485 కాగా, ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.2505కి పెరుగుతుంది. అంటే కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. ఢిల్లీ నుంచి పాట్నాకు దూరం దాదాపు 1000 కిలోమీటర్లు. అదేవిధంగా.. ఢిల్లీ – పాట్నా మధ్య నడుస్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 3A ఛార్జీ ప్రస్తుతం రూ.1350 ఉండగా, జూలై 1 నుంచి దాదాపు రూ.20 పెరుగుతుంది. అంటే.. ఛార్జీ రూ.1370కి పెరుగుతుంది. అదే సమయంలో.. ఢిల్లీ-పాట్నా స్లీపర్ క్లాస్ ఛార్జీ ప్రస్తుతం రూ.510గా ఉంది. ఇది 10 రూపాయలు పెరుగి రూ. 520కి చేరుతుంది.
READ MORE: DGCA : దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ‘సర్వేలెన్స్’..
