NTV Telugu Site icon

Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?

General Coach

General Coach

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతోంది. దేశంలోని సరిహద్దు ప్రాంతాలను పెద్ద మెట్రోలతో అనుసంధానించడానికి ఈ రైళ్లు పనిచేస్తున్నాయి. దీంతో.. దేశంలోని కనెక్టివిటీలో భారతీయ రైల్వే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక నియమాలను రూపొందించింది.

Read Also: RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు

రైలులో ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.. అందులో ప్రయాణించడం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులో ఏసీ, స్లీపర్, జనరల్ ఇలా అనేక రకాల కోచ్‌లు ఉంటాయి. అయితే చాలా మంది రైలులోని జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తుంటారు. అయితే జనరల్ కోచ్‌లో ప్రయాణించేందుకు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి. లేదంటే.. పట్టుబడితే జరిమానా విధిస్తారు.

Read Also: Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు టికెట్ తీసుకోకుండా భారతీయ రైళ్ల జనరల్ కోచ్‌లో ప్రయాణించి.. పట్టుబడితే, రూ. 250 జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా.. టీటీ (TTE) మీ ప్రయాణానికి పూర్తి ఛార్జీని వసూలు చేస్తారు. ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టేందుకు టీటీఈ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి డబ్బులు అడగడం చాలాసార్లు చూస్తాం.. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక టీటీ జరిమానా కంటే ఎక్కువ డబ్బు అడిగితే, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా.. http://www.coms.indianrailways.gov.in/ లింక్‌ని సందర్శించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.