NTV Telugu Site icon

Moscow Attacks: ఉగ్రదాడిపై రష్యాకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ..!

10

10

తాజాగా మాస్కో నగరంలోని ఓ కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రదాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా., చాలా మంది క్షతగాత్రులుగా మారారు. ఈ తాజా ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దారుణ ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించాడు. ఇది హేమమైన చర్య అని ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తాను సంతాపం తెలుపుతున్నట్లు తెలియజేశారు. ఈ విషాద ఘటన కారణంగా రష్యా దేశంలోనే ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.

Also Read: Lal Salaam : లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ పై సందిగ్దత.. కారణం అదేనా..?

ఇకపోతే ఈ దాడికి తామే కారణమని ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం నాడు వార్తా సంస్థ అమాక్ టెలిగ్రామ్ లో ప్రచురించిన ఓ ప్రకటనలో భాగంగా తామే ఈ దాడికి బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్-కే ప్రకటించుకుంది. కాకపోతే ఈ దాడికి సంబంధించి ఐఎస్ఐఎస్-కే ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. అయితే ఈ పేలుడుకు సంబంధించి అమెరికా నిఘా సంస్థ కాస్త సమాచారాన్ని సేకరించింది.

Also Read: MS Dhoni – Sachin: ఆ విషయంలో ధోనికి సిగ్గెక్కువంటున్న సచిన్..!

ఐఎస్ఐఎస్-కే సభ్యులు రష్యాలో క్రియాశాలికంగా పనిచేస్తున్నారని అమెరికా అధికారి తెలిపారు. కొద్దికాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ తన ఉనికి చాటుకోవడానికి మళ్లీ దాడులతో ప్రయత్నిస్తుందని అమెరికా ఉగ్రవాద నిరోధక సంస్థ అధికారులు చెబుతున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా రష్యాపై ఐఎస్ఐఎస్ – కే దృష్టి పెట్టిందని అధ్యక్షుడు పుతిన్ తన ప్రచారంలో పదేపదే విమర్శించారు.