NTV Telugu Site icon

Rich Persons List: బ్రిటన్‌ శ్రీమంతుల జాబితాలో భారతీయులు

Rich Persons List

Rich Persons List

బ్రిటన్‌లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్‌ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన రాజకీయ నేతలు స్థానం సంపాదించడం విశేషం.

Milk Shortage: అమెరికాలో తల్లిపాల కొరత.. ఎక్కడ చూసినా నో స్టాక్..!!

అయితే బ్రిటన్‌లోని 250 మంది శ్రీమంతుల జాబితాలో పదుల సంఖ్యలో భారతీయుల పేర్లు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా హిందూజా గ్రూప్‌కు చెందిన గోపీచంద్ హిందూజాతో పాటు వారి కుటుంబీకులు యూకే శ్రీమంతుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. వీరి ఆస్తి విలువ రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్నట్లు సండే టైమ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్, వారి కుటుంబ సభ్యులు 17 బిలియన్ పౌండ్లతో ఆరో స్థానంలో ఉన్నారు. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా ఈ జాబితాలో 913వ స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి 2.5 బిలియన్ పౌండ్లుగా సండే టైమ్స్ తెలిపింది. కాగా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఎవరో కాదు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి 0.93 శాతం షేర్లను కలిగి ఉన్నారు. అంటే రూ.6,684 కోట్లు అన్నమాట.