NTV Telugu Site icon

Asian Games 2023: ఫైనల్‌కు భారత పురుషుల స్క్వాష్ జట్టు.. స్వర్ణం కోసం పాక్తో పోరు

Sourav Goshal

Sourav Goshal

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు టీమిండియా స్వర్ణం కోసం ఫైనల్ లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

Read Also: IAF: “ప్రచండ్” హెలికాప్టర్ల కొనుగోలు.. చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరింపు..

సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అభయ్ సింగ్ భారత పురుషుల స్క్వాష్ జట్టు తరపున మొదటి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో మలేషియాకు చెందిన మహ్మద్ బహ్తియార్‌ను 3-1తో ఓడించాడు. ఆ తర్వాత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్.. 3-1తో ఇయన్ యోవ్ ఎన్‌జిని ఓడించి ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.

Read Also: Fire Accident: ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆసియా క్రీడలు 2023లో భారత్ ఇప్పటివరకు 32 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. సెప్టెంబరు 28న జరిగిన వివిధ క్రీడా ఈవెంట్లలో ఇండియా అద్భుత ప్రదర్శన కనపరించింది. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జోర్డాన్ ప్లేయర్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

Show comments