Russia Ukraine Conflict: రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
- రష్యా సైన్యం తరపున పోరాడుతూ
- ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న ఓ భారతీయుడు ఉక్రెయిన్ దళాలకు పట్టబడ్డాడు. మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. గుజరాత్‌లోని మోర్బి నివాసి మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ యుద్ధభూమిలో కేవలం మూడు రోజులు గడిపిన తర్వాత 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్‌కు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపినట్లు సమాచారం. కైవ్‌లోని భారత మిషన్ ధృవీకరిస్తోందని ANI నివేదిక తెలిపింది.
Also Read:Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బుక్ అయిన టికెట్ తేదీలను కూడా మార్చుకోవచ్చు..
Also Read
హుస్సేన్ మొదట్లో రష్యాకు చదువుకోవడానికి వెళ్లాడని, కానీ తరువాత మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారని ఉక్రేనియన్ సైన్యం టెలిగ్రామ్ పోస్ట్‌లో ఆరోపించింది . జైలుకు వెళ్లకుండా ఉండటానికి, అతను యుద్ధంలో చేరాడు అని బ్రిగేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిగేడ్ విడుదల చేసిన వీడియోలో, హుస్సేన్ రష్యన్ భాషలో మాట్లాడుతూ జైలు శిక్షను తప్పించుకోవడానికి తాను రష్యన్ సైన్యంలో చేరానని అంగీకరించినట్లు కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, అక్టోబర్ 1న ఫ్రంట్ లైన్లకు పంపబడే ముందు తాను కేవలం 16 రోజుల ప్రాథమిక శిక్షణ మాత్రమే పొందానని హుస్సేన్ వివరించాడు. తన కమాండర్‌తో విభేదాల తర్వాత, అతను లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. “నేను రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రేనియన్ కందకంలో చిక్కుకున్నాను” అని అతను చెప్పాడు.
పిటిఐ నివేదిక ప్రకారం, హుస్సేన్ మాట్లాడుతూ, “నేను వెంటనే నా రైఫిల్‌ను కింద పెట్టి, నాకు పోరాడటం ఇష్టం లేదని చెప్పాను. నాకు సహాయం కావాలి” అని కోరినట్లు వెల్లడించాడు.
Also Read:Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్
కాగా భారత పౌరులను రష్యన్ సైన్యంలోకి నియమించుకునేందుకు ఒత్తిడి చేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులను విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని భారత్ మాస్కోపై ఒత్తిడి తెచ్చిందని గత నెలలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక గణాంకాల ప్రకారం, 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 150 మందికి పైగా భారతీయులను నియమించుకున్నారు. గత సంవత్సరం రష్యా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటివరకు, ఈ వివాదంలో సుమారు 12 మంది భారతీయులు మరణించారు, 96 మందిని రష్యన్ అధికారులు విడుదల చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!