Site icon NTV Telugu

Rajkumar Mishra: లండన్‌లో మేయర్‌గా ఎన్నికైన భారతీయుడు..

Up News

Up News

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆయన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి మేయర్ ఎన్నికల్లో గెలిచారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్ లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

READ MORE: Vijayawada Fraud: ఉద్యోగం అన్నాడు.. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చాడు.. నిరుద్యోగులను నిండా ముంచాడు..!

రాజ్‌కుమార్ మిశ్రా మీర్జాపూర్ జిల్లా సదర్ తహసీల్‌లోని భటేవ్రా గ్రామ నివాసి. 5 సంవత్సరాల క్రితం M.Tech చేయడానికి లండన్ వెళ్ళారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే పని చేయడం ప్రారంభించారు. ఇంతలో.. రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. రెండు నెలల క్రితం.. ఆయన లేబర్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఏప్రిల్ 3న కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత, ఏప్రిల్ 12న పార్టీ ఆయనను వెల్లింగ్‌బరో నగర మేయర్‌గా ఎన్నుకుంది. రాజ్ కుమార్ మిశ్రా తాజాగా లండన్ నుంచి తన వీడియోను విడుదల చేశారు.

READ MORE: Surat: 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి..

లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారనే వార్త వినగానే, మీర్జాపూర్‌లోని ఆయన ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. చండీగఢ్‌లో బి.టెక్ పూర్తి చేసిన తర్వాత.. రాజ్‌కుమార్ కంప్యూటర్ సైన్స్‌లో ఎం.టెక్ చదవడానికి లండన్ వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైతు మున్నా లాల్ మిశ్రా కుమారుడు రాజ్‌కుమార్ మిశ్రా తొమ్మిది మంది తోబుట్టువులలో ఆరవవాడు. ప్రతాప్‌గఢ్ నివాసి అభిషేక్తా మిశ్రాను వివాహం చేసుకున్నారు. అభిషేక్తా కూడా ఒక ఇంజనీర్. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Exit mobile version