Indian Embassy: అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ విడుదల
- నకిలీ కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- భారతీయులు తమ ఇమిగ్రేషన్ సంబంధిత పత్రాలు అప్డేట్ చేసుకుని చట్టబద్ధంగా ఉండాలంటూ సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Embassy: అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ముఖ్యమైన అడ్వైజరీ విడుదల చేసింది. ఇటీవల భారత రాయబార కార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ (Fraud Calls) ఎక్కువగా వస్తుండటంతో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారత రాయబార కార్యాలయం పేరుతో కొందరు మోసగాళ్లు భారతీయులను టార్గెట్ చేస్తున్నారని.. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ ఫారమ్, వీసాలో లోపాలున్నాయని నమ్మించి ఆ లోపాలను సరిచేసేందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అలా అడిగిన డబ్బు చెల్లించకపోతే అమెరికా నిబంధనల ప్రకారం భారత్‌కు తిరిగి పంపిస్తామని లేదా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నట్లు వివరించింది భారత రాయబార కార్యాలయం.
Read Also: BYD Cars: కొత్త అప్డేట్ ఫీచర్లతో మార్కెట్లో హల్చల్ చేస్తున్న BYD కార్లు
Also Read
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
అంతేకాకుండా.. ఈ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డు వివరాలు అడిగే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించింది. అమెరికాలో ఉన్న భారతీయ పౌరులతో పాటు, వీసా దరఖాస్తుదారులకు కూడా ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపింది.
Read Also: ITBP: స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. 10th పాసైతే చాలు
భారత రాయబార కార్యాలయం అధికారులు ఎవరూ వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగరని, అధికారికంగా కేవలం “@mea.gov.in” మెయిల్ ద్వారా మాత్రమే సంప్రదిస్తారని స్పష్టం చేసింది. భారతీయులు ఈ విషయం గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మొదటి నుంచీ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి పాటిస్తున్న సంగతి తెలిసిందే. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం, ఈ విధానాన్ని మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని భారతీయులతో పాటు, ఇతర దేశీయులను కూడా అమెరికా సైనిక విమానాల ద్వారా వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు తమ ఇమిగ్రేషన్ సంబంధిత పత్రాలు అప్డేట్ చేసుకుని చట్టబద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!