layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
layoffs: సాయంత్రం షిఫ్ట్‌లో ప్రశాంతంగా పని చేసుకుంటున్న ఉద్యోగులకు హఠాత్తుగా ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆన్-లైన్లో లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే వారి జీవితాలు తలకిందులైపోయాయి. ఒక అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్న భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్‌కు కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌తో ఊహించని షాక్ తగిలింది. ఈ సంఘటనను ఆ టీమ్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ బ్యాంక్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న కస్టమర్ సపోర్ట్ టీమ్ మొత్తాన్ని ఒక్క దెబ్బకు తొలగించారు. ఆ రోజు సాయంత్రం 6:30 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాత్రి 9:30 గంటల సమయంలో అత్యవసరంగా ఒక గూగుల్ మీట్ లింక్ పంపించారు. తీరా మీటింగ్‌లో జాయిన్ అయ్యాక, భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్ మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు బాంబు పేల్చారు.
కేవలం ఆ ఐదు నిమిషాల కాల్‌తో ఏకంగా 80 మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. “అందరూ ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయారు.. ఆ ఒక్క ఐదు నిమిషాల కాల్ 80 కుటుంబాల జీవితాలను రోడ్డున పడేసింది. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు తోసేసే ఇలాంటి కార్పొరేట్ కంపెనీల కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినందుకు చాలా బాధగా ఉంది” అని ఆ ఉద్యోగి తన ఆవేదనను వెళ్లగక్కారు. ఉన్నపళంగా ఉద్యోగం ఊడిపోవడంతో ఇప్పుడు మరో ఉద్యోగం ఎలా వెతుక్కోవాలో పాలుపోవడం లేదని, ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ లబోదిబోమన్నారు. అసలు అంతమందిని ఒక్కసారిగా ఎందుకు తీసేశారనే దానికి సమాధానంగా.. భారతీయ టీమ్ నుంచి తమకు అనుకున్నంత స్థాయిలో అవుట్‌పుట్ (ఫలితాలు) రావడం లేదని కంపెనీ భావించినట్లు ఆ ఉద్యోగి తెలిపారు. అమెరికా టీమ్‌తో పోలుస్తూ మన ఉద్యోగుల పనితీరును తక్కువ చేసి చూపడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడి ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకునే పనిచేశారని పేర్కొన్నారు. అయితే ఈ లేఆఫ్స్‌కు సంబంధించి ఆ అమెరికన్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనగానీ, వివరణగానీ రాలేదు. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించేటప్పుడు అనుసరిస్తున్న ఇటువంటి క్రూరమైన పద్ధతులు, ఉద్యోగులకు ఇచ్చే మద్దతుపై ఈ ఉదంతం తీవ్రమైన చర్చకు దారితీసింది.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!