Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్‌లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. అయితే, ఈ ముగ్గురు ఆటగాళ్లు టెస్ట్, వన్డే క్రికెట్‌లో ఇంకా కొనసాగుతున్నారు. ఈ ఆటగాళ్లు త్వరలోనే మిగితా ఫార్మాట్ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
Also Read: TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల..? నేడు సభలో చర్చ..
మరోవైపు గబ్బర్ గా ప్రసిద్ధి పొందిన శిఖర్ ధవన్, ఇంకా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఈ ఏడాదిలో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. ధవన్ చివరి టెస్ట్ 2018, చివరి టీ20 2021, చివరి వన్డే 2022లో ఆడారు. అలాగే కార్తీక్ చివరి టెస్ట్ 2018, చివరి వన్డే 2019, చివరి టీ20 2022లో ఆడారు. ఇక తాజాగా ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్ అనంతరం, రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో జరిగిన 0-3 సిరీస్ ఓటమి అశ్విన్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. టీ20 2022లో, వన్డే 2023లో చివరి మ్యాచ్ లు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్లేయింగ్ XIలో చోటు పొందకపోవడం అశ్విన్‌ను రిటైర్మెంట్ నిర్ణయానికి దారితీసింది.
Also Read: Jagtial Fraud: అవ్వా అని ఆప్యాయంగా పిలిచి అన్నీ దోచుకుపోయాడు..
2024లో భారత క్రికెట్‌ను వీడిన మొత్తం 12 మంది ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.
* సౌరభ్ తివారీ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* వరుణ్ ఆరోన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* దినేష్ కార్తీక్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* కేదార్ జాదవ్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* విరాట్ కోహ్లీ – T20I నుండి రిటైర్మెంట్
* రోహిత్ శర్మ – T20I నుండి రిటైర్మెంట్
* రవీంద్ర జడేజా -T20I నుండి రిటైర్మెంట్
* శిఖర్ ధావన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* బరీందర్ సరన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* రిద్ధిమాన్ సాహా – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* సిద్ధార్థ్ కౌల్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్
* ఆర్ అశ్విన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్