Divya Deshmukh: నా ఆట తప్ప అన్నీ చూశారు.. చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chess Player Divya Deshmukh: ఓ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ టోర్నీలో మహిళా ప్లేయర్స్‌ను ప్రేక్షకులు ఎలా చిన్న చూపు చూశారో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తాను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నట్లు తెలిపింది. చెస్ టోర్నీ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు తనను వేధింపులకు గురి చేసినట్లు భారతీయ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆరోపించారు.
Read Also: Rahul Gandhi: నితీష్ కూటమి నుంచి అందుకే వైదొలిగారు.. మౌనం వీడిన రాహుల్
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
“ప్రేక్షకులు నా అందాన్ని గమనించడం పట్ల గర్వంగా ఉంది. కానీ వారు నా ఆటను పట్టించుకోలేదు. అది తప్ప అన్నీ చూశారు. నేను వేసుకున్న బట్టలు, నా జుట్టు, నేను మాట్లాడే విధానం.. ఇలా సంబంధం లేని అన్ని విషయాలు పట్టించుకున్నారు” అని చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఆ పోస్టులో చెప్పింది. ఈ టోర్నీలో దివ్య దేశ్‌ముఖ్ 12వ స్థానంలో నిలిచింది. చెస్ లో మేల్ ప్లేయర్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని, మహిళా ప్లేయర్స్‌ను వాళ్ల ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అంచనా వేస్తున్నట్లు దివ్య దేశ్‌ముఖ్ ఆరోపించింది. ఇది చాలా బాధాకర విషయమన్న ఆమె.. మహిళలు చెస్ ఆడే సమయంలో వాళ్లు ఎంత బాగా ఆడతారో ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. నాగపూర్‌కు చెందిన 18 ఏళ్ల అంతర్జాతీయ మాస్టర్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ గత ఏడాది ఏషియన్ వుమెన్స్ చెస్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!